Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 50

Janaka receives Viswamitra in Mithila !!

బాలకాండ
ఏబదియవ సర్గము
( విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో మిథిలానగరము ప్రవేశించుట)

తతః ప్రాగుత్తరాం గత్వా రామస్సౌమిత్రిణా సహ |
విశ్వామిత్రం పురస్కృత్య యజ్ఞ వాటం ఉపాగమత్ ||

స|| తతః రామః సౌమిత్రిణః సహా విశ్వామిత్రం పురస్కృత్య ప్రాగుత్తరం గత్వా యజ్ఞవాటం ఉపాగమత్ |

తా|| అప్పుడు శ్రీరాముడు లక్ష్మణునితో కలిసి విశ్వామిత్రుని వెంట ఈశాన్యదిశగా ప్రయాణముచేసి యజ్ఞశాలకి చేరిరి.

రామస్తు మునిశార్దూలం ఉవాచ సహ లక్ష్మణః |
సాధ్వీ యజ్ఞసమృద్ధిర్హి జనకస్య మహాత్మనః ||

స|| రామః లక్ష్మణః సహ మునిశార్దూలం సాధ్వీ మహాత్మనః ఉవాచ " జనకస్య యజ్ఞసమృద్ధిర్హి "|

తా|| అప్పుడు లక్ష్మణునితో కూడిన రాముడు మునిశార్దూలమైన విశ్వామిత్రునితో ఇట్లు చెప్పెను." మహాత్ముడైన జనకుని యజ్ఞశాల సమృద్ధిగానున్నది"

బహూనీహ సహస్రాణి నానాదేశ నివాసినామ్|
బ్రాహ్మణానాం మహాభాగ వేదాధ్యయన శాలినామ్ ||

స|| ఇహ బహూణీ సహస్రాణి నానాదేశ నివాసినామ్ బ్రాహ్మణానాం మహాభాగ వేదాధ్యయనశాలినామ్ (సంతి) |
తా|| "ఇచ్చట వెలకొలదీ అన్నిదేశములలో నివశించు మహాపండితులైన వేదాధ్యయనము చేసిన బ్రాహ్మణులు కలరు".

ఋషివాటాశ్చ దృశ్యంతే శకటీ శతసంకులాః |
దేశో విధీయతాం బ్రహ్మన్ యత్ర వత్స్యామహే వయం||

స|| హే బ్రహ్మన్ ! ఋషివాటాశ్చ శత శకటీ సంకులాః దృశ్యంతే |వయం దేశో యత్ర వత్స్యామహే విధీయతం |
తా|| "ఓ బ్రహ్మన్ ఇచట ఋషినివాసములు వందలకొలదీ శకటములూ కనపడుచున్నవి. మనము ఏ ప్రదేశములో వుండవలెనో మీరు నిర్ణయింపుడు"

రామస్య వచనం శ్రుత్వా విశ్వామిత్రో మహామునిః |
నివేశమకరోద్దేశే వివిక్తే సలిలాయుతే ||

స|| మహామునిః విశ్వామిత్రః రామస్య వచనం శ్రుత్వా వివిక్తే సలిలాయుతే దేశే నివేశం అకరోత్ |
రా|| మహాముని అయిన విశ్వామిత్రుడు రాముని వచనములను విని జలసౌకర్యము గల ప్రశాంతమైన ప్రదేశమును తమ నివాసముగా చేసెను.

విశ్వామిత్రం అనుప్రాప్తం శ్రుత్వా స నృపతిస్తదా |
శతానందం పురస్కృత్య పురోహితమనిందితమ్ |
ప్రత్యుజ్జగామ సహసా వినయేవ సమన్వితః ||

స|| సః నృపతిః విశ్వామిత్రం అనుప్రాప్తం శ్రుత్వా వినయేవ సమన్వితః అనిందితం పురోహితం శతానందం పురస్కృత్య సహసా ప్రత్యుజ్జగామ |

తా|| ఆ రాజు విశ్వామిత్రుడు వచ్చెనని విని వినయముతో నిందింపలేని పురోహితుడగు శతానందుని తీసుకొని త్వరగా అచటికి వచ్చెను.|

ఋత్విజోs పి మహాత్మాన స్త్వర్ఘ్యమాదాయ సత్వరమ్|
విశ్వామిత్రాయ ధర్మేణ దదుర్మంత్ర పురస్కృతమ్ ||

స|| ఋత్విజః అపి సత్వరం అర్ఘ్యం అదాయ ధర్మేణ మంత్ర పురస్కృతం మహాత్మనః విశ్వామిత్రాయ తత్ దదుః |
తా|| ఋత్విజులు కూడా వెంటనే అర్గ్యము తీసుకువచ్చి ధర్మయుక్తముగా మంత్రములతో మహాత్ముడగు విశ్వామిత్రునకు సమర్పించిరి.

ప్రతిగృహ్య చ తాం పూజాం జనకస్య మహాత్మనః |
ప్రపచ్ఛ కుశలం రాజ్ఞో యజ్ఞస్య చ నిరామయం ||

స|| మహాత్మనః జనకస్య పూజాం ప్రతిగృహ్య (సః) రాజ్ఞో కుశలం యజ్ఞస్య నిరామయం చ ప్రపచ్ఛ |
తా|| మహాత్ముడైన జనకుని పూజలు ప్రతిగ్రహించి మహాముని ఆ రాజుని కుశలములను నిరాటంకముగా జరుగుచున్న యజ్ఞముని గురించి అడిగెను.

స తాంశ్చాపి మునీన్ పృష్ట్వా సోపాధ్యాయపురోధనః|
యథా న్యాయం తతః సర్వైః సమాగచ్ఛత్ ప్రహృష్టవత్ ||

స|| సః తాం మునీన్ యథా న్యాయం పృష్ట్వా తతః సోపాధ్యాయ పురోధనః సర్వైః ప్రహృష్ఠవత్ సమాగచ్ఛత్ |
తా|| పిమ్మట ఆ మునులను కూడా యథావిథిగా అడిగి అప్పుడు ఆ పురోహితులతో సంతోషముగా కలిసి వెళ్ళెను.

అథ రాజా మునిశ్రేష్ఠం కృతాంజలిరభాషత |
ఆసనే భగవనాస్తాం సహైభిర్మునిపుంగవైః ||

స||అథ రాజా కృతాంజలిః మునిశ్రేష్ఠం అభాషత | హే భగవన్ తాం మునిపుంగవైః సహ ఆసనే ( తిష్ఠతు) |

తా|| అప్పుడు రాజు అంజలి ఘటించి ఆ మునిశ్రేష్ఠునితో ఇట్లు పలికెను. " ఓ భగవన్ ! ఆ ముని పుంగవులతో కలిసి ఆసనమును గ్రహించుడు."

జనకస్య వచశ్రుత్వా నిషసాద మహామునిః |
పురోధా ఋత్విజ శ్చైవ రాజా చ సహమంత్రిభిః ||

స|| మహామునిః జనకస్య వచః శ్రుత్వా నిషసాద | రాజా ఋత్విజశ్చ ఏవ మంత్రిభిః సహ పురోధా |

తా|| ఆ మహాముని జనకుని వచనములను విని ఆసనము స్వీకరించెను. పిమ్మట రాజు పురోహితులు ఋత్విజులు మంత్రులతో కలిసి ఉపవిష్టుడాయెను |

ఆసనేషు యథాన్యాయం ఉపవిష్టాన్ సమంతతః |
దృష్ట్వా స నృపతిస్తత్ర విశ్వామిత్రం అథాబ్రవీత్ ||

స|| ఆసనేషు యథాన్యాయం సమంతతః ఉపవిష్ఠాన్ దృష్ట్వా స నృపతిః విశ్వామిత్రం అథాబ్రవీత్ |
తా|| ఆసనములలో యథావిథముగా కూర్చునిన వారిని చూచి ఆ రాజు విశ్వామిత్రునితో ఇట్లు పలికెను.|

అద్య యజ్ఞ సమృద్ధిర్మే సఫలా దైవతైః కృతా |
అద్య యజ్ఞ ఫలం ప్రాప్తం భగవద్దర్శనాన్మయా ||

స|| మే అద్య యజ్ఞ సమృద్ధిః దేవతైః సఫలా కృతా |భగవత్ దర్శనాత్ మయా యజ్ఞఫలం అద్య ప్రాప్తం |

తా|| దేవానుగ్రహమువలన ఈ దినము యజ్ఞమునకు సమృద్ధి కలిగినది సఫలము కూడా అయినది. నేడు భగవత్ సత్తములైన మీ దర్శనముచే యజ్ఞఫలము లభించినది.

ధన్యోస్మి అనుగృహీతోస్మి యస్యమే మునిపుంగవ |
యజ్ఞోపసదనం బ్రహ్మన్ ప్రాప్తోsసి మునిభిస్సహ ||

స|| హే బ్రహ్మన్ యస్య మే యజ్ఞోపసదనం మునిభిః సహ మునిపుంగవః ప్రాప్తోసి ధన్యోస్మి అనుగృహీతోస్మి |
తా|| హే బ్రహ్మన్ ! యజ్ఞోపసదనమునకు మునులతో సహా మునిపుంగవులు రావుట వలన ధన్యుడనైతిని. అనుగ్రహింపబడిన వాడనైతిని.|

ద్వాదశాహం తు బ్రహ్మర్షే శేషమాహుర్మనీషిణః |
తతో భాగార్థినో దేవాన్ ద్రష్టుం అర్హసి కౌశిక ||

స|| హే బ్రహ్మర్షీ ! మనీషిణః ద్వాదశాహం శేషం ఆహుః ! తతః కౌశికా భాగార్థినో దేవాః ద్రష్టుం అర్హసి |
తా|| ఓ బ్రహ్మర్షీ పన్నెండు రోజులు మిగిలినవి . అప్పుడు యాజ్ఞభాగములను తీసుకొను దేవతలను మీరు చూచెదరు గాక |

ఇత్యుక్త్వా మునిశార్దూలం ప్రహృష్టవదనస్తదా |
పునస్తం పరిపృచ్ఛ ప్రాంజలిః ప్రణతో నృపః ||

స|| మునిశార్దూలం ఇత్యుక్త్వా తదా ప్రహృష్టవదనః నృపః ప్రాంజలిః ప్రణతో పునః తం పరిపృచ్చ|
తా|| ఆ మునిశార్దూలముతో ఇట్లుపలికి ఆ రాజు సంతోషముతో అంజలిఘటించి మరల ఇట్లు అడిగెను.

ఇమౌ కుమారౌ భద్రం తే దేవతుల్యపరాక్రమౌ |
గజసింహగతీ వీరౌ శార్దూల వృషభౌపమౌ ||
పద్మపత్ర విశాలాక్షౌ ఖడ్గతూణీధనుర్ధౌ |
అశ్వినావివ రూపేణ సముపస్థితయౌవనౌ ||

స|| భద్రం తే | ఇమౌ కుమారౌ దేవతుల్య పరాక్రమౌ , శార్దూల వృషభౌపమౌ , గజసింహగతీ వీరౌ , పద్మపత్ర విశాల అక్షౌ, ఖడ్గతూణీర ధనుర్ధరౌ రూపేణ అస్వినాం ఇవ, సముపస్థిత యౌవనౌ (అస్తి)

తా|| మీకు క్షేమమగుగాక. ఈ కుమారులిద్దరూ దేవతలతో సమానమైన పరాక్రమము గలవారు, శార్దూలము వృషభము పోలిన వారు, గతిలో గజ సింహములను పోలినవారు , పద్మపత్రము వంటి విశాలమైన కన్నులు గలవారు ,ఖడ్గము తూణీరము ధనస్సు ధరించినవారు, రూపములో అశ్వినీ దేవతలను పోలినవారు, యౌవ్వనమునకు తగిన వయస్సు గలవారు.

యదృచ్ఛయైవ గాం ప్రాప్తౌ దేవలోక దివామరౌ|
కథం పద్భ్యామిహ ప్రాప్తౌ కిమర్థం కస్య వా మునేః||

స|| అమరౌ దేవలోకాద్ ఇవ యదృచ్చయైవ గాం ప్రాప్తః | కథం మునేః పద్బ్యాం ఇహ ప్రాప్తః ? కిమర్థం కస్యా వా?

తా|| అదృష్టవసాత్తు దేవలోకమునుంచి వచ్చిన అమరులు వలె నున్నవారు,ఓ మునీ పాదనడకలతో ఏట్లు వచ్చిరి ? ఎందుకు వచ్చిరి ?

వరాయుధధరౌ వీరౌ కస్యపుత్రౌ మహామునే|
భూషయంతా విమం దేశం చంద్ర సూర్యావివాంబరమ్ ||

స|| మహామునే వీరౌ వరాయుధ ధరౌ కస్యపుత్రౌ ? ఇమం దేశం చంద్ర సూర్య మివ అంబరం భూషయంతాం |

తా|| ఓ మహామునీ ! శ్రేష్టమైన ఆయుధములను ధరించి వచ్చిన వీరులు ఎవరి పుత్రులు ? సూర్యచంద్రులు ఆకాశమును అలంకరించినట్లు వీరు ఈ దేశమునకు అలంకారమువలె నున్నవారు".

పరస్పరస్య సదృశౌ ప్రమాణేంగితచేష్టితైః |
కాకపక్షధరౌ వీరౌ శ్రోతుం ఇచ్ఛామి తత్త్వతః ||

స|| ప్రమాణాంగిత చేష్టితైః పరస్పర సదృశౌ కాకపక్ష ధరౌ వీరౌ తత్త్వతః శ్రోతుం ఇచ్ఛామి |
తా|| ప్రామాణమునందు, చేష్టలలోను రూపములోనూ వీరు ఒకరినొకరు పోలి ఉన్నరు. జూలుపాలతో యున్న వీరిగురించి వినుటకు కోరుచున్నాను|

తస్య తద్వచనం శ్రుత్వా జనకస్య మహాత్మనః |
న్యవేదయన్మహాత్మానౌ పుత్రౌ దసరథస్య తౌ |

స|| మహాత్మనః జనకస్య తస్య తత్ వచనం శ్రుత్వా తౌ మహాత్మానౌ దశరథస్య పుత్రౌ (ఇతి) న్యవేదయన్ |

తా|| మహాత్ముడగు జనకుని ఆ వచనములను విని అ మహాత్ములిద్దరూ దశరథుని పుత్రులని నివేదించెను.

సిద్ధాశ్రమనివాసం చ రాక్షసానాం వథం తథా |
తచ్చాగమన మవ్యగ్రం విశాలాయాశ్చ దర్శనం||

స|| సిద్ధాశ్రమ నివాసం చ రాక్షసానాం వథం తథా విశాలాయాశ్చ దర్శనం తత్ ఆగమనం అవ్యగ్రం ( నివేద్య)|
తా|| సిద్ధాశ్రమములోనివశించుట, రాక్షసులవథ, విశాలనగర దర్శనము అచటి నుండి వచ్చుట (గురించి చెప్పెను)

అహల్యా దర్శనం చైవ గౌతమేన సమాగమమ్ |
మహాధనుషి జిజ్ఞాసాం కర్తుమ్ ఆగమనం తథా ||

స|| అహల్యా దర్శనం చ గౌతమేన సమాగమనం చ తథా మహాధనుషి జిజ్ఞాసాం కర్తుం ఆగమనం ( నివేద్య)
తా|| అహల్యా దర్శనము, గౌతమ మహాముని తో సంగమము , ఆ మహధనస్సుగురించి తెలిసుకొనుటకు ఆశక్తి తో ఇచటికిరావడము ( గురించి చెప్పెను)

ఏతత్సర్వం మహాతేజా జనకాయ మహాత్మనే |
నివేద్య విరరామాథ విశ్వామిత్రో మహామునిః ||

స|| ఏతత్ సర్వం మహాతేజా జనకాయ విశ్వామిత్రో మహాత్మనే నివేద్య అథ విరరామ |
తా|| ఇవన్నీ మహాతేజోవంతుడగు జనకునికి చెప్పి మహాముని అయిన విశ్వామిత్రుడు విరమించెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే పంచాశస్సర్గః ||
సమాప్తం||
||ఓమ్ తత్ సత్ ||

|| om tat sat ||